
ఘనంగా శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలు
ఈ ఫొటోలో అందరి మధ్యలో ఉన్న వృద్ధురాలి పేరు బుగ్గమ్మ.
హైదరాబాద్: ఈ ఫొటోలో అందరి మధ్యలో ఉన్న వృద్ధురాలి పేరు బుగ్గమ్మ. వయసు 103 సంవత్సరాలు. తన కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, ముని మనవరాళ్ల సమక్షంలో ఆదివారం బుగ్గమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జియాగూడ సబ్జిమండి నీలకంఠనగర్‌లో నివసిస్తున్న బుగ్గమ్మకు 13 మంది సంతానం.