కువైట్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు | ys jagan mohanreddy birth day celebrations in kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

Dec 22 2016 7:36 PM | Updated on Jul 25 2018 4:09 PM

కువైట్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు - Sakshi

కువైట్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి.

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్దఒత్తున కమిటీ సభ్యులు, అభిమానులు రక్తదానం చేశారని వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కువైట్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, ఎం బాలిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

కువైట్ జాబ్రియా ప్రాంతంలో ఉన్న బ్లడ్ బ్యాంకులో కమిటీ సభ్యులు మర్రి కల్యాణ్, పి.రఫీక్ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. తమ అభిమాన నాయకుడు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కో కన్వీనర్లు గోవింది నాగరాజు, ఎం వీ నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సెల్ సభ్యులు ఎస్. మహేశ్వర్‌రెడ్డి, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు ఎం. ప్రభాకర్‌రెడ్డి, ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, అన్నాజీ శేఖర్, కె.రమణయాదవ్, పూలపుత్తూరు సిరేష్‌రెడ్డి, జి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, షేక్ రఫీ, రాపూరు రమణ, ఫయాజ్, ఆకుల చలమతి, జగన్‌రాడు, కల్లూరు వాసుదేవరెడ్డి, కె.నాగసుబ్బారెడ్డి, సక్కిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, రవిశంకర్, లక్కిరెడ్డి రాజారెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, ప్రసాద్ అభిమానులకు ఇలియాస్, బాలిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement