మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంపు | Wages hike for Muncipal Contract Labour | Sakshi
Sakshi News home page

మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంపు

Sep 17 2014 1:34 AM | Updated on Oct 16 2018 6:35 PM

మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

  • నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు రూ. 6,700 నుంచి 8,300 
  •   వర్కర్ల వేతనాలను రూ.6,700 నుంచి 7,300కి పెంపు
  •  సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.  తెలంగాణ మునిసిపల్ వాటర్ వర్క్స్, ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి మేరకు .. వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పనిచేస్తున్న నాన్ పబ్లిక్ హెల్త్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలను పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.  
     
    మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న నాన్ పబ్లిక్ హెల్త్ కాంట్రాక్టు వర్కర్ల వేతనాలు రూ.6,700 నుంచి 8,300లకు, నగర పంచాయతీ కాంట్రాక్టు వర్కర్ల వేతనాలను రూ.6,700 నుంచి రూ.7,300లకు పెంచింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ ఉత్తర్వులను అమలు చేయాలని మంగళవారం మరోసారి ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement