పెద్ద నోట్ల పరిణామంతో ఇబ్బందులు | Common People Facing Problems With Cash in Banks | Sakshi
Sakshi News home page

పెద్ద నోట్ల పరిణామంతో ఇబ్బందులు

Jan 3 2017 2:08 AM | Updated on Sep 5 2017 12:12 AM

పెద్ద నోట్ల పరిణామంతో ఇబ్బందులు

పెద్ద నోట్ల పరిణామంతో ఇబ్బందులు

పెద్దనోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని పత్తి, అపరాల

ఖమ్మం వ్యవసాయం : పెద్దనోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని పత్తి, అపరాల కొనుగోళ్లును ఆయన పరిశీలించారు. రైతులు పంట ఉత్పత్తులు విక్రయిస్తే చెక్కులు ఇస్తున్నారని, వాటిని బ్యాంకుల్లో ఇస్తే నగదు చేతికందేందుకు 20 రోజులకు పైగా పడుతోందన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలకు కూడా నిత్యం చేసిన పనికి నగదు అందడం లేదని, వారం రోజులకు కూడా కూలీ ఇవ్వడం లేదని, దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు.

వేరుశనగ ఉత్పత్తిని మార్కెట్‌కు తీసుకువస్తే వెం టనే కొనుగోలు చేయ డం లేదని, ధర నిర్ణయించిన తరువాత ఆరబెట్టించి, కాంటాలు పెడుతున్నారని, ఇది మంచిది కాదని చెప్పారు. పెసలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.5,225 మద్దతు ధర ప్రకటించగా, మార్కెట్‌లో కేవలం రూ.3 వేలకు మించి కొనుగోలు చేయటం లేదని తెలి పారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కల్వకుంట్ల గోపాల్‌రావు, రాపర్తి శరత్, ఫజల్, దడవాయి సంఘం నాయకులు పి.నర్సింహారావు, పి.ఆదినారాయణ, శివారెడ్డి, తాటికొండ కృష్ణ, శ్రీనివాసరావు, నిర్మల, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement