అమ్మాయిల విషయం.. యువకుడి హత్య | Young Man Brutal Murder in Yeshwanthpur | Sakshi
Sakshi News home page

అమ్మాయిల విషయం.. యువకుడి హత్య

Apr 12 2018 6:11 PM | Updated on Aug 21 2018 6:02 PM

Young Man Brutal Murder in Yeshwanthpur - Sakshi

సాక్షి, యశ్వంతపుర: అమ్మాయిల విషయంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ యువకుడు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన కర్ణాటకలోని కామాకిపాళ్య పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. యువతుల వ్యవహారంలో ఇటీవల మెజిస్టిక్‌ వద్ద రెండు గ్యాంగ్‌లు కొట్టుకున్నారు. ఈ విషయంపై మాట్లాడాలని కెంగేరికి చెందిన కోటేశ్వర(21)ను అతని ముగ్గురు స్నేహితులు ఫోన్‌ చేసి రమ్మన్నారు. 

అతను కామాక్షిపాళ్య సమీపంలోని ఉన్న మైదానానికి వెళ్లాడు. ఆ సమయంలో మరో ఎనిమిది మంది అక్కడకు చేరుకుని మారణాయుధాలతో కోటేశ్వర, అతని స్నేహితులపై దాడి చేసి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురినీ చికిత్స నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement