అమానుషం..కొత్తమలుపు

Yadagirigutta Girls Smuggling Nalgonda - Sakshi

సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రెండు నెలల క్రితం వెలుగుచూసిన బాలికల అక్రమ రవాణా కేసు కొత్తమలుపు తిరుగుతోంది. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో మరెన్నో కోణాలు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయని జోరుగా చర్చజరుగుతోంది.

నిజాలు నిగ్గుతేలేనా..?
నాలుగు దశాబ్దాలుగా పవిత్ర పుణ్యక్షేత్రంలో వ్యభిచారం జరుగుతున్నా.. పోలీస్, ఇంటెలిజె న్స్‌ వర్గాలు కళ్లు మూసుకున్నాయా..? అమానవీయ దందాలో రాజకీయ ప్రమేయం ఉందా..? బాలికల అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరు వైద్యులు ఎక్కడ..?. హర్మోన్‌ ఇంజక్షన్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? పోలీసులు కాపాడిన బాలికలకు ఇప్పటి వరకు అందని పరిహారం. చిన్నారులు ఎవరో ఇంకా తేలని వైనం ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తు న్న అంశం సంచలనంగా మారింది. ఈ అంశాలన్నీ చర్చకు వచ్చి నిజాలు నిగ్గుతేలుతాయా అన్ని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

అధికారులకు ఆదేశాలందడంతో..
పవిత్ర పుణ్యక్షేత్రంలో గత జూలై 30వ తేదీన  వెలుగు చూసిన అమానవీయ బాలికల బలవంతపు వ్యభిచార దారుణాలపై విచారణ జరుగుతోంది. దీనిపై జిల్లా పోలీసు, ఇతర శాఖల అధికారులను కోర్టు విచారణకు హాజరుకావా లని ఆదేశాలు ఇవ్వడంతో  చర్చనీయాంశంగా మారింది. మూడు రోజులుగా హైకోర్టులో ఈపాç ³ కూపంపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. యాదగిరిగుట్టలో కంసాని కళ్యాణి అనే వ్యభిచార గృహనిర్వాహకురాలు బాలికను చిత్రహింసలకు గురిచేయడంతో పొరుగింటి వారు ఇచ్చిన సమాచారంతో విషయం మొత్తం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

బాలికల అక్రమ రవాణా ఇలా..
వ్యభిచార గృహ నిర్వాహకులు కొందరు బాలకలను కిడ్నాప్‌ చేసి ఎత్తుకొస్తారు. ఇంకొందరిని రూ.లక్షలు పోసికొంటారు. మరికొందరిని మా యమాటలతో పట్టుకొస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఆడపిల్లలు తమ పిల్లలే అని చెప్పి స్కూళ్లలో చేర్పిస్తారు.ఎవరడిగినా తామే తల్లిదండ్రులని చెప్పాలంటూ చిత్రహింసలు పెడతారు. శరీర అవయవాలు పెంచేందుకు, యుక్త వయస్కులుగా కనిపించేందుకు ఇంజెక్షన్ల ద్వారా హార్మోన్లు ఎక్కిస్తారు.14ఏళ్లు రాగానే వ్యభిచార కూపంలోకి దింపుతారు.

చిన్నారులను రక్షించడానికి ఎవరైనా వస్తున్నారన్న అనుమానం వస్తే నేలమాళిగల్లో దాచిపెడుతారు. విపరీతమైన చిత్రహింసలకు గురిచేస్తూ వారిని వ్యభిచార కూపంలోకి దించుతారు. చిన్నారులను కొనుగోలు చేయడానికి ఫైనాన్స్‌ ఇచ్చే వ్యాపారులు ఉన్నారు.చిన్నారుల ఎదుగుదల కోసం హార్మోన్ల ఇంజక్షన్‌లు ఇస్తున్న డాక్టర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అతిగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపిన ఈహార్మోన్‌ల ఇంజక్షన్‌లు ఎక్కడినుంచి వచ్చాయో తేలలేదు. సరఫరా చేసిన మెడికల్‌ షాపులు యాజమానులను ఇంతవరకు గుర్తించలేదు.దీంతోపాటు వ్య భిచార గృహాల నుంచి రక్షించిన చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించారు తప్ప వారి తల్లిదండ్రులను ఇంతవరకు గుర్తించలేదు.

36మంది బాలికలకు విముక్తి
యాదగిరిగుట్టలో వ్యభిచార ముఠా దారుణాల పై రాచకొండ పోలీసులు 36మంది బాలికలకు విముక్తి కల్పించారు. ఈ వృత్తితో సంబంధం ఉ న్న 21మందిపై పీడీయాక్టు నమోదు చేశారు. 19వ్యభిచార గృహాలను సీజ్‌ చే సి 34మందిని అరెస్టు చేశారు. విముక్తి కల్పించిన బాలికలను సంరక్షణకేంద్రాలకు తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top