వరకట్నం వేధింపులకు తల్లీకూతురు బలి | Women Committed Suicide In Tungathurthi | Sakshi
Sakshi News home page

వరకట్నం వేధింపులకు తల్లీకూతురు బలి

Jul 5 2018 1:02 PM | Updated on Jul 5 2018 1:02 PM

Women  Committed Suicide In Tungathurthi - Sakshi

ఉమ (ఫైల్‌), చిన్నారి అశ్విత మృతదేహం

అడ్డగూడూరు(తుంగతుర్తి) : వరకట్నం వేధింపులకు తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాద సంఘటన బుధవారం అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రగూడూరు గ్రామానికి చెందిన శ్రీరాముల అశోక్‌కు గుండాల మండలం పాచిళ్ల గ్రామానికి చెందిన ఉమ(29)తో 2013లో వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు కుమార్తెల సంతానం. వీరిలో పెద్దమ్మాయి మిల్కీ, చిన్నమ్మాయి అశ్విత(8నెలలు). కొంతకాలంగా అశోక్‌ వరకట్నం తేవాలని భార్యను వేధిస్తున్నాడు. బుధవారం ఉదయం భార్యాభర్త నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇంట్లో ఉమ కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. చిన్నకుమార్తె అశ్వితకు కూడా మంటలు వ్యాపించడంతో 90శాతం కాలిపోయారు.

వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లీకూతురు మరణించినట్టు తెలిపారు. ఉమ తల్లిదండ్రులు మాత్రం అశోక్‌ వరకట్నం కోసం తమ కూతురు, మనుమరాలిపై కిరోసిన్‌ పోసి హత్య చేశాడని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement