పట్టపగలు మహిళపై కాల్పులు | Woman Was Shot At And Critically Injured By Assailants In Delhi | Sakshi
Sakshi News home page

పట్టపగలు మహిళపై కాల్పులు

Dec 6 2019 11:39 AM | Updated on Dec 6 2019 11:46 AM

Woman Was Shot At And Critically Injured By Assailants In Delhi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు అందరూ చూస్తుండగానే మహిళపై దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు.

ముంబై : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. లోని ప్రాంతంలో బస్‌స్టాండ్‌లో తన సోదరితో కలిసి ఆటో కోసం వేచిచూస్తున్న మహిళపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. దుండగుల కాల్పుల్లో బాధితురాలు ఇందిరా వర్మ తల వెనుక భాగంలోకి బుల్లెట్‌ దూసుకుపోగా చికిత్స నిమిత్తం జీటీబీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని లోని డీఎస్పీ రాజ్‌కుమార్‌ పాండే పేర్కొన్నారు. గోకుల్‌పురిలోని గంగా విహార్‌ కాలనీలో ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్న ఇందిరా వర్మ లోని ప్రాంతంలో తన సోదరి సుదేష్‌ వర్మను చూసేందుకు రాగా వారిద్దరూ కలిసి ఇదే ప్రాంతంలో ఉంటున్న వారి కజిన్‌ సీమా ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వివరించారు. బాధితురాలు కొన్నేళ్లుగా భర్త నుంచి విడిపోయారని పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement