నమ్మిన ఇంటికే కన్నం పెట్టిన స్నేహితురాలు | Woman Robbed Friend House In Hyderabad | Sakshi
Sakshi News home page

నమ్మిన ఇంటికే కన్నం పెట్టిన స్నేహితురాలు

May 12 2018 8:29 PM | Updated on Sep 4 2018 5:44 PM

Woman Robbed Friend House In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్ : నమ్మి ఇంట్లోకి రానిస్తే స్నేహితురాలి ఇల్లుగుళ్ల చేసిందో మహిళ. ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్నేహితురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన వంగావోలు సునితదేవిని, దొంగిలించిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన గోశిక నరసింహ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 4.2లక్షల విలువైన 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీసీ వెంకటేశ్వరరావు ఎల్‌బీ నగర్‌లోని తన కార్యాలయంలో మీడియాకి వివరాలను వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement