సాక్షి, దొడ్డబళ్లాపురం: బావతో సహజీవనం చేస్తున్న మరదలు అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని నెలమంగల తాలూకా లక్కసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన మహిళను పద్మ(40)గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త ఇరవయ్యేళ్ల క్రితం చనిపోవడంతో బావ గంగ గుడ్డయ్య తనకూ ఎవరూ లేకపోవడంతో చేరదీశాడు. అతడితో పద్మ సహజీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. పద్మ తలపై గుడ్డయ్య దుడ్డుకర్రతో మోది హత్య చేశాడు. నెలమంగల గ్రామీణ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.