breaking news
nelamangala
-
పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు : పోకిరీల వేధింపులు తాళలేక బాలిక ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల తాలూకా ఎడేహళ్లి గ్రా మంలో చోటుచేసుకుంది. ఎడేహళ్లిని చెంది న ధనలక్ష్మి (14)ని ఇదే గ్రామానికి చెందిన జగదీష్, రవికుమార్ అనే ఇద్దరు యువకులు నిత్యం వేధించేవారు, యువకుల వేధింపులు తాళలేని ధనలక్ష్మి శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక ధనలక్ష్మి మృతి చెందింది. మరణానికి ముందు పోలీసులు బాలిక వద్ద తీసుకున్న మరణ వాగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. -
సహజీవనం.. మరదలిని చంపిన బావ
సాక్షి, దొడ్డబళ్లాపురం: బావతో సహజీవనం చేస్తున్న మరదలు అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని నెలమంగల తాలూకా లక్కసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన మహిళను పద్మ(40)గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త ఇరవయ్యేళ్ల క్రితం చనిపోవడంతో బావ గంగ గుడ్డయ్య తనకూ ఎవరూ లేకపోవడంతో చేరదీశాడు. అతడితో పద్మ సహజీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. పద్మ తలపై గుడ్డయ్య దుడ్డుకర్రతో మోది హత్య చేశాడు. నెలమంగల గ్రామీణ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నెలమంగల వద్ద నానో
భూ కేటాయింపులకు సమ్మతించిన ప్రభుత్వం నాలుగు నెలల్లో పనులు పూర్తి సీఎన్ఆర్ రావు వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోనే తొలి నానో టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ను నగర శివారులోని నెలమంగల వద్ద స్థాపించనున్నట్లు భారత రత్న, నానో టెక్నాలజీ కర్ణాటక విజన్ గ్రూపు చైర్మన్ ప్రొఫెసర్ సీఎన్ఆర్. రావు తెలిపారు. డిసెంబరు నాలుగు నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ‘ఏడవ బెంగళూరు ఇండియా నానో’ను పురస్కరించుకుని సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో టెక్నాలజీ అండ్ సాఫ్ట్ మెటల్స్’ పేరిట ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీనికి 16 ఎకరాలను కేటాయించడానికి ప్రభుత్వం సమ్మతించిందని చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే మూడు, నాలుగు నెలల్లో సంస్థ ప్రారంభమవుతుందన్నారు. దీని వల్ల విద్యార్థులతో పాటు పారిశ్రామికవేత్తలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ సంస్థకు డెరైక్టర్ను కూడా నియమించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్. పాటిల్ మాట్లాడుతూ బెంగళూరు ఇండియా నానోలో ప్రధానంగా శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘గుజరాత్ నమూనా’ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, వాస్తవానికి తమ వద్ద అంతకంటే నయమైన నమూనా ఉందని చెప్పారు. దేశంలోనే కర్ణాటక నానో టెక్నాలజీలో నాయకత్వ దశకు చేరుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నానో టెక్నాలజీలో తమతో పోటీ పడవచ్చని అన్నారు. ‘మా విధానాన్ని ప్రధాని అనుకరిస్తే మంచిది’ అని ఆయన చమత్కరించారు.