మహిళ దారుణ హత్య

Woman Murdered In Guntur - Sakshi

మృతురాలి శరీరంపై 7, 8 కత్తిపోట్లు

ఘటనాస్థలంలో క్లూస్‌ టీం,  డాగ్‌స్క్వాడ్‌ పరిశీలన

అనుమానాస్పదస్థితిలో మృతిగా కేసు నమోదు

సత్తెనపల్లి: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సత్తెనపల్లి పట్టణం, చెంచుకాలనీ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని అచ్చంపేట రోడ్డు, పోలేరమ్మ దేవాలయం సమీపానికి చెందిన నూర్‌బాషా ఇమాంబీ (36)కి తెనాలికి చెందిన కాలేషావలితో 20 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా పదిహేనేళ్ల కిందట ఇమాంబీ భర్త, పిల్లలను వదిలేసి సత్తెనపల్లి వచ్చింది. అప్పటి నుంచి పట్టణానికి చెందిన తాజుద్దీన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. 40 రోజుల కిందట తాజుద్దీన్‌ మృతి చెందాడు. కాగా తాజుద్దీన్‌కు కొంత నగదు ఇవ్వాల్సి ఉందని, ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో వివాదం ఉన్నట్లు పోలీసులకు సమాచారం. పట్టణంలోని చెంచుకాలనీ సమీపంలో నివసిస్తున్న ఇమాంబీతో తాజుద్దీన్‌ సోదరుడైన చినబాబు అలియాస్‌ వడ్డీల బాబుకు  వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్వక్తపరుస్తున్నారు. గురువారం ఇమాంబీ గృహంలో హత్యకు గురైన విషయం తెలియడంతో సత్తెనపల్లి డీఎస్పీ వి.కాలేషావలి, సత్తెనపల్లి రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.వీరయ్య, అర్బన్‌ ఎస్‌ఐలు అశోక్‌బాబు, శేషాచార్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇమాంబీ శరీరంపై 7, 8 కత్తిపోట్లు ఉండడాన్ని గుర్తించారు.

వెంటనే క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం అందించారు. క్లూస్‌ టీం వేలిముద్రలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్‌ ఇమాంబీ ఇంటి వద్ద నుంచి చెంచుకాలనీలోకి ప్రవేశించి ఆగిపోయింది. ఈ క్రమంలో ఇమాంబీని హతమార్చిన వ్యక్తి చెంచుకాలనీ వైపుగా వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇమాంబీని చినబాబు హత్యచేశాడా లేక మరెవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తపరుస్తూ విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి సైదాబీ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top