కాకతీయ కాలువలో మహిళ గల్లంతు | Woman Missing in Kakatiya Canal Kamareddy | Sakshi
Sakshi News home page

కాకతీయ కాలువలో మహిళ గల్లంతు

Oct 1 2018 11:55 AM | Updated on Oct 17 2018 6:10 PM

Woman Missing in Kakatiya Canal Kamareddy - Sakshi

రేణుక(ఫైల్‌)

మోర్తాడ్‌ (నిజామాబాద్‌): భర్తతో గొడవ పడిన ఓ యువతి కాకతీయ కాలువలో దూకి గల్లంతైన ఘటన ఆదివారం ఏర్గట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాల్కొండకు చెందిన మారుతి, జగిత్యాల్‌ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రేణుకను వివాహం చేసుకున్నాడు. అయితే రెండు రోజుల కింద రేణుక తన తల్లిగారి ఇంటికి ఇబ్రహీంపట్నంకు వెళ్లింది. రేణుకను తమ ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన మారుతి బైకుపై తీసుకుని కాకతీయ కాలువ వెంబడి వస్తుండగా మార్గమధ్యంలో మూత్ర విసర్జన కోసం వాహనం ఆపాడు.

అప్పుడు ఇరువురి మధ్య చిన్న వాదన జరిగింది. కాగా రేణుక అకస్మాత్తుగా కాలువలోకి దూకింది. కాలువ ప్రవాహం జోరుగా ఉండటంతో రేణుక కొట్టుకుపోయింది. దీంతో కంగారుపడిన ఆమె భర్త మారుతి ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కాకతీయ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. భీమ్‌గల్‌ సీఐ సైదయ్య, ఏర్గట్ల ఎస్‌ఐ హరిప్రసాద్‌ల ఆధ్వర్యంలో రేణుక కోసం గాలిస్తున్నారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement