కూకట్‌పల్లిలో కలకలం! | woman died.. fell down from building | Sakshi
Sakshi News home page

లాడ్లీ మృతి.. భర్తపై అనుమానం

Jan 27 2018 11:15 AM | Updated on Sep 4 2018 5:37 PM

woman died.. fell down from building - Sakshi

ఐదో అంతస్తుపైనుంచి పడిన లాడ్లీ

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో లాడ్లీ అనే 24 ఏళ్ల వివాహిత.. అపార్ట్‌మెంట్‌పైనుంచి పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలోని శ్రీనిధి గార్డెన్స్‌లో సాయి ముదిరాజ్‌, అతని భార్య లాడ్లీ ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదో అంతస్తుపైనుంచి లాడ్లీ కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఆమె భర్త సాయి ముదిరాజ్‌.. ఆ విషయాన్ని భార్య తండ్రి రాజేష్‌ భండారీకి సమాచారం అందించాడు. అయితే తన కూతురు చావుకు సాయి ముదిరాజ్‌, అతని కుటుంబ సభ్యులే కారణమని లాడ్లీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతికి తాను కారణం కాదని, ఆడుకుంటూ ఆడుకుంటూ తమ పెంపుడు కుక్క హఠాత్తుగా మీది పడటంతో అయిదో అంతస్తుపైనుంచి తన భార్య పడిపోయిందని సాయి ముదిరాజ్‌ చెప్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement