అతిగా మద్యం తాగి మహిళ మృతి | Woman Died With Alcohol Drinking | Sakshi
Sakshi News home page

అతిగా మద్యం తాగి మహిళ మృతి

Apr 6 2018 10:52 AM | Updated on Apr 6 2018 10:52 AM

Woman Died With Alcohol Drinking - Sakshi

పులిచెర్ల(కల్లూరు): పూటుగా మద్యం సేవించి మహిళ మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి మండలం నాగులచెరువుపల్లెకు చెందిన పి.మంజుల తన భర్తతో కలిసి పులిచెర్ల మండలంలోని చల్లావారిపల్లెలో శివకుమార్‌ ఇటుకల బట్టీలో ఐదేళ్లుగా కూలి పనులు చేసుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరికి తాగుడు అలవాటు ఉంది. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించి పడుకున్నారు. మ ద్యం ఎక్కువ సేవిండంతో మంజుల పరిస్థితి విషమించింది. గమనించిన భర్త ఆమెను పీలేరు ప్రభు త్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ వాసుదేవరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement