భర్త హత్యకు భార్య కుట్ర | Woman Attacked On Husband With Her Boy Friend In Kurnool | Sakshi
Sakshi News home page

భర్త హత్యకు భార్య కుట్ర

Sep 25 2019 9:48 AM | Updated on Sep 25 2019 9:48 AM

Woman Attacked On Husband With Her Boy Friend In Kurnool - Sakshi

గాయపడిన కరిముల్లా

సాక్షి, కర్నూలు(బొమ్మలసత్రం) : భర్త హత్యకు కుట్ర పన్నిన ఓ భార్యను, ఆమె ప్రియుడిని నంద్యాల రూరల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. రూరల్‌ ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు.. నంద్యాల పట్టణ సమీపంలోని నందమూరి నగర్‌కు చెందిన కరిముల్లా, కరిష్మా దంపతులకు ఐదుగురు సంతానం. కరిముల్లా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్లుగా ఇంటి పక్కనే నివాసం ఉండే వెంకటేశ్వర్లుతో కరిష్మా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తన భర్తను కూడా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. అందులోభాగంగా ఈ నెల 20న రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేస్తున్న కరిముల్లాపై వెంకటేశ్వర్లు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అతడు తేరుకొని కేకలు వేస్తూ బయటకు పరుగెత్తడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోగా వెంకటేశ్వర్లు పరారయ్యాడు. కరిముల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు నందమూరినగర్‌లో విచారించారు. భార్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా వివాహేతర సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. కరిష్మాను, ఆమె ప్రియుడు వెంకటేశ్వరును మంగళవారం అరెస్ట్‌ చేసి అరెస్ట్‌ చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement