
సాక్షి, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో గత ఏడాది నవంబర్‌లో జరిగిన బాబా ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్య జహీదాతో పాటూ అమెకు సహకరించిన మరో నలుగురిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు.. భర్త బాబాఖాన్‌కు జహీదా నిద్రమాత్రలు అలవాటు చేసి, భర్త నిద్రమత్తులో ఉండగా పక్క రూములో ప్రియుడు ఫయాజ్‌తో కలిసి ఉండేది. అయితే ఈ విషయం బాబాఖాన్ దృష్టికి రావడంతో శాశ్వతంగా భర్తను వదిలించుకోవాలనుకుంది. ఫయాజ్‌తో పాటూ అతని స్నేహితుల సహకారంతో బాబాఖాన్‌ను జహేదా గొంతునులిమి హత్య చేసింది. అనంతరం గుండెపోటుతో బాబా ఖాన్ చనిపోయినట్లుగా అందరిని నమ్మించింది. చివరకుబంధువుల్లో ఒకరికి అనుమానం రావడంతో, పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు. దీంతో భర్త హత్య ఉదంతం వెలుగు చూసింది.