‘ఎట్టి పరిస్థితుల్లోనైనా పోలీస్‌ ఆఫీసర్‌ అవుతా’

Wanted death for all accused, will now become IPS at any cost - Sakshi

భోపాల్‌ రేప్‌ బాధితురాలు

భోపాల్‌: గత అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన భోపాల్‌ రేప్‌ ఘటన నిందితులకు 52 రోజుల తర్వా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు జీవితకాల శిక్ష విధించింది. ఈ శిక్షపై స్పందించిన బాధితురాలు.. ‘నాకు వారిని చంపేయాలని ఉంది. కానీ కోర్టు జీవితకాల శిక్ష విధించడం సంతోషమే. వారు చచ్చేంత వరకు జైలులో శిక్షను అనుభవిస్తారు. నాకు జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి జరగవద్దు. అందుకే పోలీస్‌ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒక వేళ యూపీఎస్సీ పరీక్ష ఉత్తీర్ణ కాకపోతే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ సాయంతో పోలీస్‌ ఆఫీసర్‌ను అవుతా’ అని ధీమా వ్యక్తం చేసింది.

గత అక్టోబర్‌ 31న భోపాల్‌ శివారు గ్రామంలో నివసించే బాధితురాలు కోచింగ్‌ సెంటర్‌ నుంచి రైల్వేష్టేషన్‌కు షార్ట్‌ కట్‌ రూట్‌లో వెళుతుండగా ఇద్దరు తాగుబోతులు అటకాయించారు. బలవంతంగా చేతులు, కాళ్లు కట్టేసి, పక్కనున్న కల్వర్టు దగ్గరికి తీసుకెళ్లి  అత్యాచారం చేశారు. దుస్తులు ఇవ్వమని అడిగితే నిందితుల్లో ఒకడు ఇప్పుడే వస్తానని వెళ్లి, దుస్తులతోపాటు మరో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు. నలుగురు కలిసి సుమారు నాలుగు గంటలపాటు అత్యాచారం జరిపారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే ‘సినిమా కథలు చెబుతున్నావా?’ అని వెటకారాలు ఎదురయ్యాయి. చివరికి బాధితురాలే కీచకులను గుర్తించి, గల్లాపట్టి లాక్కొస్తేగానీ కేసు నమోదుకాలేదు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరం నడిబొడ్డున చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top