అమ్మాయి శీలానికి వెల

Virginity in Auction in Warangal Rural And Panchayat Shared Money  - Sakshi

వరంగల్‌ , రాయపర్తి : అమ్మాయి శీలానికి వెల కట్టిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఓ తండాకు చెందిన అబ్బాయి ఓ గ్రామానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో అబ్బాయికి రూ. 2లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని పెద్దమనుషులే తలాకొంత పంచుకున్నట్లు తెలిసింది. అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఒక్కరూపాయి ఇవ్వకపోవడంతో గ్రామస్తులు పెద్దమనుషులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(ఈ అమ్మాయి కన్యత్వం పది కోట్లకు..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top