
ప్యాంగ్‌యాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్యకు సంబంధించిన వీడియోను కోర్టు విచారణ సమయంలో ప్రదర్శించారు. ఈ కేసులో ప్రస్తుతం ఇద్దరు మహిళలు ప్రధాన నిందితులుగా విచారణ ఎదుర్కొంటుండగా ఆ హత్య తాము చేయలేందంటూ విజ్ఞప్తి చేస్తుండగా ఆ వీడియోను ప్రదర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిమ్ జాంగ్ నామ్‌ను కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్ తనిఖీ విభాగం వద్ద విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ చర్య తాము కావాలని చేయలేదని, తమతో చేయించినవారు రియాలిటీ షో అని చెప్పారని వారు అన్నారు.
అయితే, తాజాగా వారి ముందే ప్రదర్శించిన ఆ వీడియోలో కిమ్ జాంగ్ నామ్ వస్తుండగా వియత్నాంకు చెందిన మహిళగా అనుమానిస్తున్న డోవాన్ తి హువాంగ్ తన రెండు చేతులతో నామ్ ముఖాన్ని గట్టిగా ఓసారి మూసి వెళ్లినట్లు కనిపించింది. అయితే, నామ్‌పై దాడిలో స్వయంగా సితీ ఐసియాహ్ అనే ఇండోనేషియా మహిళ లేనప్పటికీ వేరే డైరెక్షన్‌లో ఆమె పారిపోతున్నట్లు కనిపించింది. అంతేకాకుండా హువాంగ్ ప్రవర్తన ఈ సంఘటన జరగడానికి రెండు రోజుల ముందు చాలా భయానకంగా ఉందని ఈ సందర్బంగా ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి వాన్ అజిరుల్ నిజామ్ చేవాన్ అజిజ్ తెలిపారు. హువాంగ్ కోర్టును తప్పుదోవపట్టిస్తుందని, నామ్‌ను ఏమాత్రం క్షమించరాదనే దోరణితో ఆమె వ్యవహరించిందని, ఎట్టి పరిస్థితుల్లో ఆమెను శిక్షించాలని పేర్కొంది.