అడవిలో తప్పిపోయిన ఉపాధి కూలీ | upadhi coole missed | Sakshi
Sakshi News home page

అడవిలో తప్పిపోయిన ఉపాధి కూలీ

May 16 2018 11:14 AM | Updated on Aug 25 2018 5:17 PM

upadhi coole missed - Sakshi

లచ్చవ్వ(ఫైల్‌)

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : మండలంలోని దుమాల గ్రామానికి చెందిన ఉపాధి కూలీ బట్టు లచ్చవ్వ(68)ఈనెల 8న మంగళవారం కూలీ పనులకు వెళ్లి అడవిలోనే తప్పిపోయింది. అప్పటి నుంచి లచ్చవ్వకోసం కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చవ్వ కుమారుడు రాజు మూడేళ్ల క్రితం గల్ఫ్‌ వెళ్లాడు.

భర్త కొమురయ్య అనారోగ్యంతో మృతిచెందగా లచ్చవ్వ ఉపాధి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తల్లి తప్పిపోయినట్లు తెలుసుకున్న కుమారుడు రాజు ఈనెల 10న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కుటుంబసభ్యులంతా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement