ఉద్యోగం లేదని ఉసురుతీసుకున్నాడు | Unemployed Died Due to Job In Ananthapur | Sakshi
Sakshi News home page

ఉద్యోగం లేదని ఉసురుతీసుకున్నాడు

Nov 28 2018 11:39 AM | Updated on Nov 28 2018 11:39 AM

Unemployed Died Due to Job In Ananthapur - Sakshi

మృతుడు అరవింద్‌

సాక్షి, రాయదుర్గంటౌన్‌: ఉన్న ఉద్యోగం.. కొత్తగా ఎక్కడా పని దొరక్కపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డు బళ్లారి రోడ్డు పక్కన నివాసం ఉంటున్న పూల వ్యాపారి వెంకటేశులు, గీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన అరవింద్‌ (28) బీటెక్‌ చదివి బెంగళూరులోని విప్రో కంపెనీలో పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. మరో ఉద్యోగం చూసుకునేందుకు బెంగళూరుకు వెళ్లి మంగళవారం ఉదయమే రాయదుర్గం వచ్చాడు. ఉన్న ఉద్యోగం పోవడం.. సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేవారు.

Advertisement
 
Advertisement
Advertisement