యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

Two Trucks Collide kills few at Kanpur Sajeti - Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం వేకువ ఝామున రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 

కాన్పూర్‌ సమీపంలోని సజేటి దగ్గర ఓ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు. కాగా,   ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Back to Top