కేజీబీవి నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం | two students missing from kgbv | Sakshi
Sakshi News home page

కేజీబీవి నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

Jan 29 2018 1:54 PM | Updated on Aug 25 2018 5:38 PM

సాక్షి, చర్ల: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవి) నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లక్ష్మి కాలనీలో జరిగింది. స్థానికంగా ఉన్న కేజీబీవీలో చదువుతున్న కొయ్యూరుకు చెందిన గౌరి, సాయినగర్‌ కాలనీకి చెందిన సౌజన్యలు సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. వీరిద్దరూ పదో తరగతి చదువుతున్నారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement