
ప్రకాశం జిల్లా: ముండ్లమూరు మండలం చిలకలేరు వాగులో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులు ముండ్లమూరు మండలకేంద్రానికి చెందిన శ్రీరామ్(12), అరుణ్(12)లుగా గుర్తించారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.