ఖమ్మంలో మహిళా కండక్టర్‌ ఆత్మహత్య

TSRTC Strike: Woman Conductor Commits Suicide as strike enters 24nd day - Sakshi

సాక్షి, సత్తుపల్లి : మరో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సత్తుపల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నీరజ  ఆత్మహత్య చేసుకుంది. సమ్మెపై ప్రభుత్వ వైఖరికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఖమ్మంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆత్మహత్యాయత్నం చేశారు.

కాగా  నిజామాబాద్‌–2 ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించే దూదేకుల గఫూర్‌,  ముషీరాబాద్‌ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌(37) గుండెపోటుతో మృతి చెందగా, ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే  నార్కెట్‌పల్లి డిపోకు చెందిన కండక్టర్‌ వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజు కూడా కొనసాగుతోంది.

చదవండి: డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత

‘కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా.. మళ్లీ ఆయన నాకు కావాలి’

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top