తప్పొకరిది.. ఫైన్‌ మరొకరికి!

Traffic Police Challan to Wrong Bike in Karimnagar - Sakshi

వాహనం నడిపిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి చలాన్‌

పోలీసుల చర్యపై బాధితుడి ఆవేదన

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): హెల్మెట్‌ ధరించని వాహనదారుడు ఒకరైతే.. మరో వాహనదారుడికి పోలీసులు చలాన్‌ పంపించారు. ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని క్రాస్‌ రోడ్డు వద్ద ఈ నెల 19న ఎల్లారెడ్డిపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీఎస్‌ 02 ఈఈ 4628 నంబరు వాహనంపై హెల్మెట్‌ పెట్టుకోకుండా వెళ్తున్న వ్యక్తిని ఫొటో తీశారు. అనంతరం అతన్ని పట్టుకొని, చలాన్‌ పంపుతామని, ఫైన్‌ కట్టాలని మందలించి వదిలేశారు. కానీ చలాన్‌ను నిందితుడి చిరునామాకు కాకుండా చందుర్తి మండలం మూడపల్లికి చెందిన గోలి శ్రీనివాస్‌కు పంపించారు. అందులో రూ.135 ఫైన్‌ చెల్లించాలని ఉంది. దానిపై ఉన్న ఫొటోను పరిశీలించి, అది తనది కాదని బాధితుడు తెలిపారు. తన వాహనం నంబర్‌ టీఎస్‌ 02 ఈఈ 4328 అని, పోలీసులు చలాన్‌ తప్పుగా పంపించారని వాపోయాడు. చలాన్‌ను రద్దు చేయాలని శ్రీనివాస్‌ ఎస్పీని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top