మందమర్రిలో పులి చర్మం పట్టివేత 

Tiger skin is in the hands of madamarri - Sakshi

మందమర్రి రూరల్‌: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని రామన్‌కాలనీలో గురువారం అటవీశాఖ అధికారులు పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు పులి చర్మాన్ని అమ్మకానికి పెట్టారు. విషయం తెలియడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన టైగర్‌ హంటింగ్‌ అండ్‌ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అటవీ అధికారులకు పట్టి చ్చేందుకు ఆపరేషన్‌ చేపట్టారు.

వారితో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు బేరం కుదిరింది. వారి సహకారంతో మందమర్రిలో అధికారులు మాటు వేశా రు. పెద్దపల్లి జిల్లా రామారావుపేటకు చెందిన మేకల నర్సయ్య పట్టణంలో ఎవ రూ లేని ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. దీంతో పులి చర్మంతోపాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top