బయటికొచ్చినా దొంగ పనులు మానలేదు

Three Men Arrested In Serial Robberies In Delhi - Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా జైలు నుంచి బయటపడ్డ ముగ్గురు దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడి మళ్లీ జైలుపాలయ్యారు. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ కేంద్రంగా నేరాలకు పాల్పడుతూ జైలు పాలైన రాహుల్‌, సాగర్‌, ప్రమోద్‌ అనే ముగ్గరు వ్యక్తులు కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలలలో బెయిల్‌ మీద విడుదలయ్యారు. కానీ, బయటికొచ్చినా వారు నేరాలు చేయటం మానుకోలేదు. నగరంలోని ఓ రెసిడెన్షియల్‌ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ( ఆశ్రమంలోకి చొరబడి పూజారులపై దాడి )

దీంతో అంజనీ ప్రసాద్‌ శాస్త్రి అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డుపై వెళుతుండగా ఓ ముగ్గురు వ్యక్తులు బైకుపై వచ్చి తన మొబైల్‌ ఫోన్‌, డ్రైవింగ్‌ లైసెన్సుతో ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగల్ని పట్టుకోవటానికి ఆపరేషన్‌ మొదలుపెట్టారు. సీసీ కెమెరా ఫొటేజీల ద్వారా ఆధారాలు సంపాదించారు. అనంతరం పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ( భార్య చేతిలో.. తాగుబోతు భర్త హతం )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top