దొంగను పట్టించిన బావి! | Thief Dropped In The Well | Sakshi
Sakshi News home page

దొంగను పట్టించిన బావి!

May 19 2018 12:27 PM | Updated on Oct 8 2018 5:19 PM

Thief Dropped  In The Well - Sakshi

బావిలో ఉన్న రఫీ

దంతాలపల్లి(డోర్నకల్‌) : బావి.. దొంగను పట్టించడం ఏమిటని ఆలోచిస్తున్నారా! ఈ సంఘటన గురువారం రాత్రి నిజంగానే జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన రైతు మెంచు మల్లయ్య తన వ్యవసాయబావి వద్ద నాటుకోళ్లు పెంచుతున్నాడు. కోళ్లను దొంగిలించేందుకు ఇదే మండలం దాట్ల గ్రామానికి చెందిన సయ్యద్‌ రఫీ, బోర శ్రీను గురువారం రాత్రి వచ్చారు.

కాపలాగా ఉన్న రైతు మల్లయ్య అలికిడి విని వెంటనే లేవగా ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో శ్రీను, తప్పించుకోగా రఫీ సమీపంలోని వ్యవసాయ బావిలో పడిపోయాడు. అందులో నుంచి పైకి ఎక్కేందుకు అవకాశం లేకపోయింది. గ్రామస్తులు రాత్రే చూసి అతడిని పైకి లాగకుండా రాత్రంతా అందులోనే ఉంచారు.

శుక్రవారం ఉదయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన తర్వాత రఫీని పైకి లాగి అదుపులోకి తీసుకున్నారు. కాగా రైతు మల్లయ్య ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నందీప్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement