breaking news
well fall
-
దొంగను పట్టించిన బావి!
దంతాలపల్లి(డోర్నకల్) : బావి.. దొంగను పట్టించడం ఏమిటని ఆలోచిస్తున్నారా! ఈ సంఘటన గురువారం రాత్రి నిజంగానే జరిగింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన రైతు మెంచు మల్లయ్య తన వ్యవసాయబావి వద్ద నాటుకోళ్లు పెంచుతున్నాడు. కోళ్లను దొంగిలించేందుకు ఇదే మండలం దాట్ల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ, బోర శ్రీను గురువారం రాత్రి వచ్చారు. కాపలాగా ఉన్న రైతు మల్లయ్య అలికిడి విని వెంటనే లేవగా ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో శ్రీను, తప్పించుకోగా రఫీ సమీపంలోని వ్యవసాయ బావిలో పడిపోయాడు. అందులో నుంచి పైకి ఎక్కేందుకు అవకాశం లేకపోయింది. గ్రామస్తులు రాత్రే చూసి అతడిని పైకి లాగకుండా రాత్రంతా అందులోనే ఉంచారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన తర్వాత రఫీని పైకి లాగి అదుపులోకి తీసుకున్నారు. కాగా రైతు మల్లయ్య ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నందీప్ పేర్కొన్నారు. -
బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
అనంతపురం: బావిలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని విడపనకల్ మండలం పాల్తూరులో ఆదివారం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన విద్యార్థి బావిలో ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.