దోపిడీ దొంగ అరెస్ట్‌ 

Thief Captured In Orissa - Sakshi

బరంపురం ఒరిస్సా : నగరం సమీప కొత్త కమలాపూర్‌ గ్రామంలో జరిగిన దోపిడీ సంఘటనలో గోపాల్‌పూర్‌ పోలీసులు ఓ దోపిడీ దొంగను అరెస్ట్‌ చేసి ల్యాప్‌ టాప్, మొబైల్‌ ఫోన్,   రూ.25 వేల దోపిడీ సొత్తుని స్వాధీనం చేసుకున్నా రు. ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.

గత నెల 16వ తేదీన గోపాల్‌పూర్‌  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల కొత్త కమలాపురం గ్రామంలో ఒక ఇంటిలో దుండగుడు చొరబడి రూ.35 వేల నగదు, ఒక లాప్‌టాప్, ఒక సెల్‌ఫోన్‌ దోచుకుని పరారైన సంఘటనపై గోపాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు మాయారాయ్‌ ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై గోపాల్‌పూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి గొళాబందలో నివాసం ఉంటున్న దోపిడీకి పాల్పడిన ప్రమోద్‌ కుమార్‌ మెహరాని గురువారం అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిని నిందితుడిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచి బరంపురం సర్కిల్‌ జైలుకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top