ఆ అకృత్యాలపై బిహార్‌కు సుప్రీం నోటీసులు | Supreme Court issues Notice To Bihar Government In Muzaffarpur Shelter Rape Case | Sakshi
Sakshi News home page

ఆ అకృత్యాలపై బిహార్‌కు సుప్రీం నోటీసులు

Aug 2 2018 12:23 PM | Updated on Oct 16 2018 8:23 PM

Supreme Court issues Notice To Bihar Government In Muzaffarpur Shelter Rape Case - Sakshi

చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనపై సర్వోన్నత న్యాయస్ధానం ఆగ్రహం..

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ బాలికల వసతి గృహంలో మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఉదంతానికి సంబంధించి బిహార్‌ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్ధానం గురువారం నోటీసులు జారీ చేసింది. మరోవైపు షెల్టర్‌ హోంలో బాలికలపై అకృత్యాలకు నిరసనగా గురువారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్‌ పార్టీలు పిలుపు ఇచ్చాయి. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి.

చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్‌ ఇవాం వికాస్‌ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్‌ బాలికలపై నిర్వాహకులు, అధికారులు జరిపిన లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్‌లో ఈ దారుణం వెలుగుచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement