రైల్లో ఆత్మహత్య చేసుకున్న యువతి గుర్తింపు | Suicide In Bitragunta Passenger Train Was Recognised | Sakshi
Sakshi News home page

Apr 13 2018 6:40 AM | Updated on Apr 13 2018 6:40 AM

Suicide In Bitragunta Passenger Train Was Recognised - Sakshi

స్వాతిశ్రీ మృతదేహం

సాక్షి, కావలిరూరల్‌: విజయవాడ నుంచి బిట్రగుంటకు వస్తు న్న ప్యాసింజర్‌ రైల్లో బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువతి నెల్లూరుకు చెం దిన రాసాల నరసింహా రావు కుమార్తె రాసాల స్వాతిశ్రీ (25)గా గుర్తిం చారు. యువతి ఆత్మహత్యపై ‘సాక్షి’లో వచ్చిన ఫొటోతో పాటు ప్రచురితమైన వార్తను చూసి ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. గురువారం కావలి జీఆర్‌పీ పోలీసులను సంప్రదించారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాల మార్చురీలో ఉన్న యువతి మృతదేహాన్ని చూసి స్వాతిశ్రీగా నిర్ధారించుకున్నారు.

స్వాతిశ్రీ తల్లిదండ్రులు ఇద్దరికీ పక్షవాతం ఉండటంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. దీంతో బీటెక్‌ చదువు మధ్యలో ఆపేసింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమె పోటీ పరీక్షలు రాసేందుకు గత 2 నెలల నుంచి నెల్లూరులోని ఒక కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటుంది. ఈ నెల 9న కోచింగ్‌ కోసమని ఇం టి నుంచి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో 10న స్వాతిశ్రీ కుటుంబ సభ్యులు నెల్లూరు రెండో నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 11వ తేదీ రాత్రి ఆమె విజయవాడ–బిట్రగుంట ప్యాసింజర్‌ రైల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, శుక్రవారం స్వాతిశ్రీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement