కీచక ఖాకీ! 

Sub Inspector Molested Woman Constable In Jagtial District - Sakshi

మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు 

వేటు వేసిన జిల్లా ఎస్పీ 

కోరుట్ల: మహిళా కానిస్టేబుల్‌ను వేధింపులకు గురిచేస్తున్న ఓ  కీచక ఎస్‌ఐపై వేటు పడింది.  విశ్వసనీయ సమాచారం మేరకు.. జగిత్యాల జిల్లా ఓ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను అదే ఠాణాకు చెందిన ఎస్సై ఆర్నెల్లుగా వేధిస్తున్నట్లు తెలిసింది. తరచూ వాట్సాప్‌లో మెసేజ్‌ లు పెడుతూ.. వీడియో కాల్‌ చేయాలని ఆ  వేధింపులకు గురి చేసేవాడు.

బయట తెలిస్తే పరువు పోతుందేమోనని ఆమె ఎవరికీ చెప్పు కోలేక తనలో తాను కుమిలిపోయింది. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె తన సన్నిహితులు.. అలాగే అదే సబ్‌ డివిజన్‌కు చెందిన ఓ సీఐతో మొర పెట్టుకున్నట్లు సమాచారం. ఆయన ఈ విషయంపై ఆరా తీసి సదరు ఎస్సైని మందలించినట్లు తెలిసింది. సీఐ చెప్పినా అతని వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లగా.. తక్షణం అతడిని బదిలీ చేసి వీఆర్‌లో ఉంచినట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top