పాఠశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని.. | Student Commits Suicide in School Toilet Tamil Nadu | Sakshi
Sakshi News home page

పాఠశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ఆత్మహత్య

Apr 5 2019 11:55 AM | Updated on Apr 5 2019 11:55 AM

Student Commits Suicide in School  Toilet Tamil Nadu - Sakshi

మృతి చెందిన దుర్గాదేవి

కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఉదయం దుర్గాదేవి పాఠశాలను గేట్‌ను తెరచిఉంచేది.

అన్నానగర్‌: కాట్టుమన్నార్‌ కోవిల్‌ సమీపంలో బుధవారం పాఠశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ ఆలయం సమీపం కుమరాట్చి మెయ్యత్తురైకి చెందిన ఏలుమలై (39) ఉప్పు వ్యాపారి. ఇతని రెండో కుమార్తె దుర్గాదేవి (13). అదే ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇంటి సమీపంలోనే పాఠశాల ఉండడంతో కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఉదయం దుర్గాదేవి పాఠశాలను గేట్‌ను తెరచిఉంచేది.

ఈ ప్రకారం బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆమె గేట్, తరగతి గదులు, మరుగుదొడ్లను తెరచింది. తరువాత మరుగుదొడ్డికి వెళ్లిన దుర్గాదేవి అక్కడ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల ప్రారంభమైన తరువాత విద్యార్థినులు మరుగుదొడ్డి వైపు వెళ్లగా అక్కడ దుర్గాదేవి శవంగా వేలాడుతుండడం చూసి కేకలు వేశారు. దీనిపై ఉపాధ్యాయులు వెంటనే కుమరాట్చి పోలీసులకు, బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలిక  తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement