అత్యాచార నిందితులపై కఠిన చర్యలు  | Strict actions against rape accused | Sakshi
Sakshi News home page

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు 

Apr 27 2018 1:40 PM | Updated on Jul 28 2018 8:53 PM

Strict actions against rape accused - Sakshi

ఆస్పత్రిలో వివరాలు తెలుసుకుంటున్న ప్రసాద్‌

పాలకొండ : బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధిం చి నిందితులపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కఠిన చర్యలు తీసుకుంటుందని కమిషన్‌ రాష్ట్ర సభ్యుడు పి.వి.వి.ప్రసాద్‌ అన్నా రు. సీతంపేట మండలానికి చెందిన 8 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసును పరిశీలించేందు గురువారం రాత్రి పాలకొండ ఏరి యా ఆస్పత్రికి వచ్చిన ఆయన వైద్యులతో మాట్లాడారు.

డీఎస్పీ జి.స్వరూపరాణికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసు నమోదైన వెంటనే బాధితురాలికి రూ.4లక్షలు పరిహారం అందజేస్తామని తెలిపారు. కేసు నీరు గార్చకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయనతో పాటు చైల్డ్‌లైన్‌ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్‌ రమణ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎల్‌.శాంతకుమారి ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement