హీరో ఇంటిపై రాళ్ల దాడి

Stones Thrown at Kannada Actor Darshan House - Sakshi

కిటికీ, కారు అద్దాలు ధ్వంసం  

ఫ్లెక్సీ చించివేత

గుర్తుతెలియని దుండగుల అకృత్యం  

తీవ్రంగా ఖండించిన సుమలత

ప్రముఖ నటుడు దర్శన్‌ నివాసం, కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. బెంగళూరు రాజరాజేశ్వరినగర ఐడియల్‌ హోం లేఔట్‌లోని ఆయన నివాసంపై శనివారం తెల్లవారుజామునా మూడుగంటల సమయంలో రాళ్లు విసరటం వల్ల కిటికీ, కారు అద్దాలు పగిలిపోయాయి. అంబరీశ్‌ ఫోటోతో పెట్టిన ఫ్లెక్సీని చించివేశారు. విషయం తెలుసుకున్న రాజరాజేశ్వరినగర పోలీసులు దర్శన్‌ నివాసం వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.

మండ్య లోక్‌సభ సీటులో స్వతంత్ర అభ్యర్థిని సుమలతా అంబరీష్‌కు మద్దతుగా ప్రచారం చేయటం వల్ల దుండగులు రాళ్ల దాడి చేశారని దర్శన్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో దర్శన్‌ ఆయన భార్య విజయలక్ష్మీ గిరినగరలోని మరో నివాసంలో ఉన్నారు. సెక్యూరిటీ గార్డు ఒక్కరే ఉన్నారు. సుమలత తరఫున ప్రచారంలో పాల్గొనడం ఆపకుంటే నటుల ఆస్తులపై విచారణ చేయిస్తామంటూ కేఆర్‌ పేట జేడీఎస్‌ ఎమ్మెల్యే నారాయణగౌడ బహిరంగంగా హెచ్చరించిన తరువాత ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం చర్చలకు దారితీసింది. సెక్యూరిటీ గార్డ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటిని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. కెంగేరి ఎసీపీ పరిశీలించారు.

యశ్‌ ఇంటికి పోలీసు భద్రత
స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారే కారణంగా నటుడు దర్శన్‌ ఇళ్లు, కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేయటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హొసకెరెహళ్లిలోని యశ్‌ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ అణ్ణామలై తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top