సెక్స్‌ రాకెట్ ‌: మరో ఆరుగురికి విముక్తి | Six Girls Rescued From Brothels In Yadagirigutta | Sakshi
Sakshi News home page

Sep 5 2018 7:55 PM | Updated on Sep 5 2018 7:58 PM

Six Girls Rescued From Brothels In Yadagirigutta - Sakshi

‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరుతో వ్యభిచార గృహాలపై పోలీసులు మెరుపుదాడులు

సాక్షి, యాదగిరిగుట్ట : వ్యభిచార నిర్వాహకులు, బాలికల అక్రమ రవాణా ముఠా కలిసి సాగిస్తున్న చీకటి వ్యాపారానికి చెక్‌ పెట్టే దిశగా పోలీస్‌ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరుతో వ్యభిచార గృహాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. వ్యభిచార ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పిస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా మరో ఆరుగురికి విముక్తి కలిగించారు. ఆలేరు రైల్వేస్టేషన్‌లో వ్యభిచార నిర్వహకుడి అరెస్ట్‌ చేశారు. రక్షించిన వారిలో ఇద్దరు యువతులు, నలుగురు బాలికలు ఉన్నారు. బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement