వీడియో వైరల్‌.. జీవితాలు జైలు పాలు

Six Arrested For Beer Bath In Gujarat - Sakshi

అహ్మదాబాద్‌ : పెళ్లి వేడుకలో బీరుతో స్నానం చేసి, అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావటంతో జైలు పాలయ్యారు కొందరు యువకులు. ఈ సంఘటన గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధురలోని కందగార గ్రామంలో ఫిబ్రవరి 26న ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హాజరైన ఆరుగురు యువకులు ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం ‘పీలే.. పీలే.. ఓ మోర్‌ రాజ.. పీలే,పీలే’ అనే హిందీ పాటకు డ్యాన్స్‌ చేస్తూ.. బీరును ఒకరినెత్తిపై ఒకరు పోసుకుంటూ హల్‌చల్‌ చేశారు. పెళ్లికి వచ్చిన ఓ వ్యక్తి వారి చేష్టలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో ఉంచాడు. దీంతో శనివారం రోజు ఆ వీడియో తెగ వైరల్‌ అయింది. ఈ వీడియోపై ఐజీ సుభాష్‌ త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరుగురిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. ఐజీ ఆదేశాల మేరకు ఎస్పీ ఆరుగురు యువకులను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top