లైంగిక వేధింపులు.. కీచక ఎస్ఐపై వేటు | SI suspend in sexual harrasment case | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌కు లైంగిక వేధింపులు.. ఎస్ఐపై వేటు

Oct 20 2017 6:41 PM | Updated on Sep 2 2018 5:06 PM

SI suspend in sexual harrasment case - Sakshi

నెల్లూరు: మహిళా సర్పంచ్‌ను లైంగికంగా వేదించిన ఎస్ఐ ఏడు కొండలుపై సస్పెన్షన్‌ వేటుపడింది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు తన పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌పై లేగింక వేదింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ ఏడుకొండలును సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు వూటుకూరు సర్పంచి పద్మజను గత కొంతకాలం నుంచి వేధిస్తున్నాడు. ఏడుకొండలు తనను అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిళా సర్పంచ్‌పై వేధింపులు నిజమేనని తేలిన నేపథ్యంలో సైదాపురం ఎస్ఐని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement