ఐసీయూ వెలుపల సెక్యూరిటీ గార్డు హత్య | Security Guard Stabs Guard At A Hospital | Sakshi
Sakshi News home page

ఐసీయూ వెలుపల సెక్యూరిటీ గార్డు హత్య

Apr 6 2019 9:53 AM | Updated on Apr 6 2019 10:15 AM

 Security Guard Stabs Guard At A Hospital - Sakshi

సెక్యూరిటీ గార్డు హత్య

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానికి సమీపంలోని గురుగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన గార్డు కత్తితో దాడి చేసిన ఘటనలో మరో సెక్యూరిటీ గార్డు మరణించారు. శీతల్‌ ఆస్పత్రిలోని ఐసీయూ వెలుపల జరిగిన ఈ దాడిలో బాధితుడని జుగల్‌ కిషోర్‌గా గుర్తించారు. సెక్యూరిటీ గార్డు కిషోర్‌ను కత్తితో పొడిచిన నిందితుడు నౌఫిల్‌ అన్వర్‌ హత్యానంతరం పరారయ్యాడని పోలీసులు చెప్పారు.

దాడి జరిగే సమయంలో ఆస్పత్రి ఎంట్రన్స్‌ గేట్‌ వద్ద అన్వర్‌ ఉండగా, మూడో ఫ్లోర్‌లోని ఐసీయూ వెలుపల కిషోర్‌ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్వర్‌ కిషోర్‌పై దాడిచేసి అతని ఛాతీ, ముఖం, పొట్టపై కత్తితో పొడవడంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడని డీసీపీ వెస్ట్‌జోన్‌ సుమీర్‌ సింగ్‌ చెప్పారు. హత్యకు దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, బాధితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, ఇతర గార్డులను ప్రశ్నించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement