సంగీతపై మరోసారి దాడి | Sangeetha Attacked Again | Sakshi
Sakshi News home page

సంగీతపై మరోసారి దాడి

Mar 5 2018 2:18 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌ : ఇంటి నుంచి గెంటేయడంతో భర్తపై పోరాటం సాగిస్తున్న సంగీతపై మరోసారి దాడి జరిగింది. ఆమె తమ్ముడు ఇంటికి వచ్చాడన్న కారణంతో అత్తమామలు, మరిది దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడంతో సంగీత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. భర్త ఇంట్లో ఉండాలని, ఆమె ఖర్చులకు నెలకు రూ.20 వేలు చెల్లించాలని ఇటీవల ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆమె బోడుప్పల్‌ శ్రీనగర్‌ కాలనీలో భర్త, టీఆర్‌ఎస్‌ మాజీ నేత కె.శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు.

ఆదివారం సాయంత్రం ఆమె తమ్ముడు రంజిత్‌రెడ్డి.. ఆ ఇంటికి రావడంతో ఎందుకు వచ్చావంటూ సంగీత మరిది శ్రీధర్‌రెడ్డి దాడికి దిగాడు. ఇది గమనించిన సంగీత.. వీడియో తీస్తుండగా ఫోన్‌ లాక్కొని అత్తమామలు, మరిది కలిసి దాడికి దిగారు. దీంతో సంగీత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మామ బాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement