ఎర్రచందనంతో పాటు స్మగ్లర్‌ అరెస్టు

Sandlewood Smuggler Arrest in Chittoor - Sakshi

చంద్రగిరి : శేషాచలంలో ఎర్రచందనం చెట్లను నేలకూల్చి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్‌తో పాటు 14 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఐ వాసు వివరాల మేరకు.. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా సోమవారం రాత్రి ఆర్‌ఎస్‌ఐ వాసు, డీఆర్‌ఓ నరసింహరావు బృందం శేషాచల అడవుల్లో కూంబింగ్‌ను ప్రారంభించింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈతగుంట, సచ్చినోడు బండ ప్రాంతాల్లో స్మగ్లర్ల అడుగు జాడలను పసిగట్టిన అధికారులు, మూడు బృందాలుగా విడిపోయి కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో శ్రీవారిమెట్టు సమీపంలోని జూపార్క్‌ వెళ్లే ముళ్లదారిలో స్మగ్లర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిపై దాడులు చేపట్టడంతో స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తమిళనాడు జవ్వాదిమలైకు చెందిన అన్నామలైను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు జాగిలాలతో తనిఖీలు చేయగా 14 ఎర్రచందనం దుంగలను లభ్యమైనట్లు తెలిపారు. సమచారం అందుకున్న డీఎస్పీ వెంకటరమణ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top