తల్లిదండ్రులకు చెప్పకుండా తిరుపతికి..

rpf police catched two kids in Nadikudi railway station - Sakshi

ఇద్దరు చిన్నారులను అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది

గుంటూరు, నడికుడి(దాచేపల్లి): నడికుడి రైల్వేస్టేషన్‌ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు చిన్నారులను ఆర్పీఎఫ్‌ పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి వెళ్లేందుకు ఎక్కిన ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి స్టేషన్‌లో దిగారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ వైకే. రావు చిన్నారులను విచారణ చేయగా ఇంట్లో చెప్పకుండా తాము తిరుపతి వెళ్లేందుకు రైలులో వచ్చామని చెప్పారు. బీబీనగర్‌కు చెందిన షేక్‌ ఖాదర్‌బాషా కుమారుడు ఖలీల్, కె. స్వామి కుమారుడు శ్రీకాంత్‌ తొమ్మిదో తరగతి  చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి వెళ్లకుండా నేరుగా సికింద్రాబాద్‌ వెళ్లి తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినట్లు విచారణలో తేలింది. ఇద్దరు చిన్నారులను స్టేషన్‌లో ఉంచి సమాచారాన్ని తల్లిదండ్రులకు అందించారు.  సీఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ ఖలీల్‌ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ వైకే. రావు చిన్నారులను తల్లిదండ్రులకు బుధవారం అప్పగించారు. కానిస్టేబుల్‌ వైకే. రావును సీఐ, ఎస్‌ఐ అభినందించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top