గుంటూరు స్టేషన్‌లో హల్‌చల్‌ : ఆమె ఎవరు?

Railway police React on Woman abusing Railway staff in Guntur - Sakshi

ఘటనపై స్పందించిన పోలీసులు

సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా యువతిని గుర్తించే ప్రయత్నం

సాక్షి, గుంటూరు: గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఓ మహిళ తిట్లదండకం అందుకున్న ఘటనపై రైల్వే పోలీసులు స్పందించారు. రైల్వే సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిట్టిన యువతిని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సకాలంలో తనకు టికెట్టు ఇవ్వకపోవడంతో రైలు మిస్సయిందన్న కోపంతో ఓ యువతి రైల్వే అధికారిని నోటికొచ్చిన తిట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా రైల్వే పోలీసులపైనా ఒంటికాలిపై లేచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఏం జరిగింది..
ఓ మహిళ టికెట్టు తీసుకోవడానికి గుంటూరు రైల్వే స్టేషన్‌ కౌంటర్‌లో నిలబడింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమెకు వెళ్లాల్సిన ట్రైన్ కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన మహిళ.. తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ..  ఉద్యోగులపై తిట్ల దండకాన్ని అందుకుంది.
‘పోలీసు అయితే ఏం చేస్తారు...?
నా వెంట్రుక కూడా పీకలేరు...
చెప్పుతో కొడతా లం... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... ’ అంటూ
నోటికొచ్చినట్టు రైల్వే సిబ్బందిని బూతులు తిట్టింది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీసును కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  (వీడియోలో ప్రసార అర్హం కాని పదాలను తొలగించాం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top