ఒక్క తప్పు.. 40 మందికి హెచ్‌ఐవీ | quack infects 40 with HIV | Sakshi
Sakshi News home page

ఒక్క తప్పు.. 40 మందికి హెచ్‌ఐవీ

Feb 6 2018 7:40 PM | Updated on Mar 28 2019 8:28 PM

quack infects 40 with HIV - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఓ వ్యక్తి చేసిన తప్పిదానికి 40 మంది జీవితాలు బలయ్యాయి. ఎయిడ్స్‌ రోగికి ఇచ్చిన సిరంజీతో ఇంజక్షన్‌ చేయడం వల్ల 40 మందికి హెచ్‌ఐవీ వైరస్‌ సోకింది. ఈ విషయం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలియడంతో హుటాహుటిన విచారణకు ఆదేశించింది. హెచ్‌ఐవీ సోకడానికి కారణమైన సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని రాష్ట్ర హోంమంత్రి ఆదేశించారు. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులను కాన్పూర్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. అక్కడ కౌన్సెలింగ్‌ నిర్వహించి చికిత్స కూడా అందిస్తున్నారు. అలాగే ఘటన జరిగిన ఉన్నావో జిల్లాలోని బంగార్‌మౌ ప్రాంతంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎయిడ్స్‌ పేషంట్‌కు ఇచ్చిన సూదితోనే ప్రతి రోగికి ఇంజెక్షన్‌ చేయడం వల్లే అందరికీ హెచ్‌ఐవీ సోకిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోందని, చాలా మంది డ్రైవర్లకు అవగాహన లేకపోవడం వల్ల తమ లారీలను అక్కడే ఆపి సుఖవ్యాధులు అంటించుకుంటున్నారని చెప్పారు. ఎయిడ్స్‌ను అరికట్టేందుకు ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ వారికి హెచ్‌ఐవీ సోకడంతో బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement