రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? | Rinku Singh Rewarded, Set To Play Key Role In Uttar Pradesh Government | Sakshi
Sakshi News home page

రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?

Mar 24 2026 1:23 PM | Updated on Mar 24 2026 1:40 PM

Rinku Singh Rewarded, Set To Play Key Role In Uttar Pradesh Government

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విన్న‌ర్‌, టీమిండియా స్టార్ క్రికెట‌ర్ రింకూ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రింకూ సింగ్‌ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌ (RSO)గా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం లక్నోలోని లోక్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక పత్రాన్ని రింకూకు ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ అందజేశారు.

కాగా వరల్డ్‌కప్ సమయంలో రింకూ తండ్రి మరణించినప్పటికి.. అంత్యక్రియలు ముగిసిన వెంటనే తిరిగి జట్టుతో చేరి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. రింకూ ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌లో 24 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అయితే చాలా మ్యాచ్‌ల‌లో అత‌డు ఆఖ‌రిలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. పాక్‌పై కేవ‌లం 4 బంతుల్లోనే 11 ప‌రుగులు చేశాడు.

ఓ వైపు గుండె నిండా బాధ ఉన్న‌ప్ప‌టికి.. భార‌త్ సాధించిన చారిత్ర‌త్మ‌క విజ‌యంలో రింకూ భాగ‌మ‌య్యాడు. దీంతో అత‌డి అంకితభావానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగంతో స‌త్క‌రించింది. 

ఉత్తరప్రదేశ్‌లో రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌ పోస్ట్ గ్రూప్-ఏ కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ. 70,000 వరకు చేతికి అందుతుంది. ఇ​‍క రింకూ సింగ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మరో ఐదుగురు అథ్లెట్లకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది.

నియ‌మాక ప‌త్రాలు అందుకున్న వారు వీరే
రింకూ సింగ్‌: రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌

రాజ్‌కుమార్ పాల్ (హాకీ): పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన హాకీ జట్టు సభ్యుడు రాజ్‌కుమార్ పాల్‌ను డీఎస్పీ గా నియమించారు.

ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్): పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు కూడా డీఎస్పీ హోదా కల్పించారు.

అజిత్ సింగ్,  సిమ్రాన్: పారాలింపిక్స్ పతక విజేతలు అజిత్ సింగ్, సిమ్రాన్‌లను జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్లుగా నియమించారు.

లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి పురస్కారాలు:
ఉద్యోగాలతో పాటు 2024-25 సంవత్సరానికి గాను తొమ్మిది మంది క్రీడాకారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాలైన లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులను అందజేశారు. వీరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించే కొత్త పథకంలో భాగంగా ఈ నియామకాలు జరిగాయి.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement