వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం..!

Police Attack On Adultery Houses In Nalgonda - Sakshi

యాదగిరిగుట్ట(ఆలేరు) : వ్యభిచార నిర్వాహకులు, బాలికల అక్రమ రవాణా ముఠా కలిసి సా గి స్తున్న చీకటి వ్యాపారానికి చెక్‌ పెట్టే దిశగా పోలీ స్‌శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వ్యభిచార గృహాలు, ‘యాదగిరిగుట్ట’ నిర్వాహకులతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృం దాలు ఆయా ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

 ఇప్పటికే యాదగిరిగుట్టలో..
గత నెల 30వ తేదీ నుంచి యాదగిరిగుట్ట పట్టణంలోని గణేష్‌నగర్‌లో పోలీసులు, ఎస్వోటీ పోలీసులు ప్రత్యేక ని«ఘా ఏర్పాటు చేసి, బాలికలను అక్ర మ రవాణా చేస్తున్న ముఠాతో పాటు వ్యభిచార రొంపిలోకి దింపుతున్న 15మంది నిర్వాహకులను అరెస్టు చేసి ఇప్పటికే జైలుకు పంపించారు. దీంతో స్థానికంగా ఉన్న కొన్ని కుటుంబాలు ఇళ్లకు తా ళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసిన వారు ఎక్కడికి వెళ్లారు.. వారి వద్ద ఎంత మంది చిన్నారులు ఉన్నారు అనే అంశాలతో, పిల్లలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అనే అంశాలపై పోలీస్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానికంగా మొన్నటి వరకు ఉన్న నిర్వాహకులు బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు చేసినట్టు సమాచారం. శనివారం యాదగిరిగుట్ట పరిసరాల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
జగిత్యాలలో సోదాలు
ఇటీవల జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, మేడిపల్లి లో, రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్‌లో పోలీ సులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ధర్మపురిలోని వ్యభిచార గృహాల్లో సుమారు 25 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు అమ్మాయిలతో పాటు ఇద్దరు నిర్వాహకులను, మెడిపల్లిలో ఆరేళ్ల వ యస్సు గల ఓ చిన్నారిని, ఇద్దరు వ్యభిచార నిర్వాహకులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మెరుపు దాడి
ఈనెల 11వ తేదీన రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యభిచార నిర్వాహకులను యాదగిరిగుట్టలో పట్టుబడిన ముఠాతో సంబంధం ఉందని అక్కడి పోలీసులు వ్యభిచారగృహాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పాకనాటి పద్మమ్మ అలియాస్‌ పద్మ, పాకనాటి సావిత్ర, బునాద్రి సంధ్య అలియాస్‌ రేఖలను అదుపులోకి తీసుకుని ఓ బాలికను కూడా అక్కడి పోలీసులు రక్షించారు. అందులోనే ఉంటున్న మరో 5 మంది నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

అబ్దులాపూర్‌మెట్‌ వ్యభిచార గృహంలో ఇబ్బందులు పడుతున్న ఓ యువతి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఆ గృహాలపై దాడులు చేయడంతో ఎనిమిది మంది నిర్వహకుల్లో ముగ్గురు దొరికినట్లు తెలిసింది. మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కాపాడిన అమ్మాయిని 13 ఏళ్ల క్రితం విజయవాడ నుంచి ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేసి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు వ్యభిచార నిర్వహకుల మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే మరికొంత మంది నిర్వాహకులను అరెస్టు చేసి వారి చేతుల్లో బందీ లుగా ఉన్న బాలికలను, యువతులను రక్షించేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే 17 మంది బాలికలకు విముక్తి
పట్టణంలో కొనసాగుతున్న ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ముఠా సభ్యుల నుంచి ఇప్పటికే 17 మంది చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పిం చారు. నిర్వాహకుల నుంచి విముక్తి కల్పించిన చి న్నారుల్లో కొంత మందిని మహబూబ్‌నగర్‌ జిల్లా అమనగల్‌లోని ప్రజ్వల హోంలో, మరి కొంత మందిన స్త్రీ, శిశు సంక్షేమ అధికారుల పర్యవేక్షణ లో ఉన్నారు. బాలికలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూసుకుంటున్నట్లు తెలుస్తోం ది. బాలికలంతా ఎక్కడి నుంచి వచ్చారు, వీరి తల్లిదండ్రులు ఎవరు అనే అంశాలపై పోలీస్‌ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top