420 పోస్టు మాస్టర్‌ | Police Arrested Postmaster Who cheated Clients In Krishna District | Sakshi
Sakshi News home page

300 మందికి నామం పెట్టిన పోస్టు మాస్టర్‌

Oct 29 2019 6:38 PM | Updated on Oct 29 2019 7:53 PM

Police Arrested Postmaster Who cheated Clients In Krishna District - Sakshi

గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నాగేంద్రను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు

సాక్షి, కృష్ణా : పోస్టాపీస్‌ ఖాతాదారులను మోసం చేసిన ఓ పోస్ట్ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బూతుమిల్లుపాడు,అజంపూడి బ్రాంచ్ లో పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న నాగేంద్ర  300 మంది ఖాతాదారులను మోసం చేసి 43 లక్షల రూపాయలు స్వాహా చేశాడు.  2014 నుండి ఖాతాదారుల నుండి డబ్బు తీసుకొని  పాస్ బుక్ జమ చేయకుండా ఆ సొమ్మంత కాజేశాడు. బాధితులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నాగేంద్రను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలియడంతో బాధితులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement